- నవంబర్ 1-19 వరకు ఎయిరిండియా విమానాలు ఎక్కొద్దని బెదిరింపు
- దాడులకు అవకాశముందంటూ వీడియో సందేశం
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌సింగ్ పన్నూ భారత్‌కు మరో హెచ్చరిక చేశాడు. నవంబర్ 1-19 మధ్యలో ఎవరు కూడా ఎయిర్‌ఇండియా విమానాలు ఎక్కొద్దని ప్రయాణికులకు బెదిరింపులకు దిగాడు.
సిక్కు అల్లర్లు జరిగి 40 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ఎయిరిండియా విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని ఓ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) వ్యవస్థాపకుడైన పన్నూ ఇలాంటి హెచ్చరికలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది నవంబర్‌లోనూ ఇలాంటి బెదిరింపులే చేశాడు.
గతేడాది నవంబర్ 19న ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌పై దాడి చేస్తామని, డిసెంబర్‌లో పార్లమెంట్‌పై దాడికి దిగుతామని బెదిరించాడు. కాగా, విమానాలకు ఎక్కొద్దని బెదిరింపులపై కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు స్పందించారు. బెదిరింపుల కు దిగడం చట్టరిత్యా నేరం అని, వీటికి భయపడేది లేదంటూ స్పష్టం చేశారు.