ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) సమర్పించేందుకు సమయం దగ్గరపడుతున్నది. ఐటీఆర్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ జూలై 31. ఈ నేపథ్యంలో రిటర్న్‌ను పాత విధానంలో ఫైల్ చేద్దామా? కొత్త విధానంలో ఫైల్ చేద్దామా అనే సందిగ్దంలో ట్యాక్స్‌పేయర్లు సతమతవుతుంటారు. పాత పన్ను విధానంలో కొన్ని ప్రయోజనాలు ఉన్నట్టే కొత్త విధానంలోనూ ఉన్నాయని గ్రహించాలి. పాత పన్ను విధానంలో పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు పలు మినహాయింపులు ఉన్న సంగతి తెలిసిందే.
వివిధ పొదుపు, ఇన్సూరెన్స్, హెచ్‌ఆర్‌ఏ మినహాయింపులు, తగ్గింపులను ఎత్తివేసి రూ.7 లక్షల ఆదాయం వరకూ పన్నులేని కొత్త విధానాన్ని మూడేండ్ల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ ప్రవేశపెట్టింది. అయితే రూ.7 లక్షలు మించితే రూ. 3 లక్షల ఆదాయం నుంచి పన్ను లెక్కింపు జరిగేలా ఈ విధానాన్ని రూపొందించారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ పన్ను మినహాయింపులు, తగ్గింపుల్ని ఆశిస్తున్నవారు పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.
డిడెక్షన్లు, ఎగ్జంప్షన్లకు ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా సరళమైన విధానాన్ని కోరుకునేవారు కొత్త పద్ధతిలో ఫైల్ చేసుకోవచ్చు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, జీతభత్యాలు అందుకునే ఉద్యోగులు వారి ఆదాయం, పన్ను భారం తదితరాలను విశ్లేషించుకుని, పాత లేదా కొత్త విధానంలో ఆదాయపు పన్ను రిటర్న్ సమర్పించే ఆప్షన్ ప్రస్తుతం లభిస్తున్నది. కొత్త పన్ను విధానంలో మినహాయింపులు, తగ్గింపులు లేవని పలువురు అపోహ పడుతుంటారు. కానీ న్యూ ట్యాక్స్ రెజీమ్‌లో సైతం మినహాయింపులు, తగ్గింపు సదుపాయాలు ఉన్నాయి. అవి...
ఇతర మినహాయింపులు
- స్పెషల్లీఏబుల్డ్ పర్సన్ అయితే ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సుకు మినహాయింపు ఉంటుంది.
- ఉద్యోగంలో భాగంగా అయ్యే కన్వీనియన్స్ వ్యయం కోసం కన్వీనియన్స్ అలవెన్సుకు మినహాయింపు లభిస్తుంది.
- టూర్‌పై గానీ, బదిలీపై గానీ చేసే ప్రయాణ వ్యయానికి కంపెనీ ఇచ్చే పరిహారానికి మినహాయింపు ఉంటుంది.
- ఉద్యోగ కార్యకలాపాల్ని రెగ్యులర్ ప్లేస్‌లో కాకుండా వేరే ప్రాంతంలో నిర్వహించేటపుడు అయ్యే సాధారణ ఖర్చుల కోసం పొందే డెయిలీ అలవెన్సుకు మినహాయింపు లభిస్తుంది.
- అధికారిక అవసరాల కోసం పొందే అలవెన్సులకు కొత్త విధానంలో మినహాయించవచ్చు.
- స్వచ్ఛంద పదవీ విరమణ సందర్భంగా సెక్షన్ 10 (10సీ) కింద లభించే పరిహారం, సెక్షన్ 10 (10) కింద పొందే గ్రాట్యుటీకి, సెక్షన్ 10 (10ఏఏ) కింద పొందే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌కు మినహాయింపు ఉంటుంది.
కొత్త పన్ను విధానంలో లభించని మినహాయింపులు
- లీవ్ ట్రావెల్ అలవెన్సు (ఎల్‌టీఏ)
- సెక్షన్ 80 టీటీఏ/సెక్షన్ టీటీబీ డిడెక్షన్
- సెక్షన్ 16 (3) కింద ఎంప్లాయ్‌మెంట్/ప్రొఫషనల్ ట్యాక్స్
- సెక్షన్ 10 (13ఏ) కింద హౌస్ రెంట్ అలవెన్సు (హెచ్‌ఆర్‌ఏ)
- సెక్షన్ 17(2)(8) కింద ఆహారం, పానీయాల కోసం యాజమాన్యాలు ఇచ్చే వోచర్లు/ఫుడ్ కూపన్లపై మినహాయింపు లభించదు
- సెక్షన్ 80సీ, 80 సీసీసీ, 80 డీడీ తదితరాలపై రూ.1.5 లక్షల వరకూ చేసే పెట్టుబడులకు పాత పన్ను విధానంలో ఉన్న మినహాయింపు సదుపాయం కొత్త పద్ధతిలో ఉండదు.
- రూ.50,000 వరకూ సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద పాత పద్ధతిలో లభించే మినహాయింపు సైతం కొత్త విధానంలో లేదు. అలాగే సెక్షన్ 80డీ కింద లభించే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం మినహాయింపూ లేదు.
- గృహ రుణంపై వడ్డీకి పాత విధానంలో లభించే మినహాయింపు కూడా కొత్త పన్ను విధానంలో లేదు.