ఉచిత పథకాలు, ఉచిత ‘బంధు’ల పేరుతో నాయకులు వాగ్దానాలు చేయడం, అధికారంలోకి రాగానే అన్నింటిపైనా పన్నుల భారం మోపడం సాధారణమై పోయింది. ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు, ఇతరత్రా టాక్సులు అన్నీ ప్రజలందరిపైనా ప్రభావం చూపుతాయి. ప్రభుత్వం ఏ పార్టీదైనా పన్నుల బరువు మాత్రం ప్రజలే మోయాల్సి వుంటుంది. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలూ పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు పెంచే పన్నులు కట్టడానికి అందరం సిద్ధంగా ఉండక తప్పని పరిస్థితి.
ఎ.ఆర్.ఆర్.ఆర్.గౌడ్, ఖమ్మం