calender_icon.png 11 January, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.3 లక్షల ఆదాయవర్గాలకు పన్ను ఊరట!?

11-12-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: కొత్త పన్ను విధానంలో తక్కువ ఆదాయ వర్గాలకు (రూ.3 లక్షల ఆదాయం శ్లాబుల్లో ఉన్నవారికి) వచ్చే 2025 ఫిబ్రవరి కేంద్ర బడ్జెట్లో పన్ను ఊరట కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదన రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. గరిష్ఠ ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉన్న ఆదాయ వర్గాలకు శ్లాబుల తగ్గింపు మినహా పెద్దగా పన్ను మార్పులేవీ ఉండవని ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

పన్ను మినహాయింపు పరిమితి పెంపు

కొత్త పన్ను విధానంలో పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.3 లక్షల నుంచి పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బడ్జెట్ సమర్పించే ముందు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.