calender_icon.png 8 April, 2025 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టవేరా బోల్తా

06-04-2025 12:00:00 AM

8 మంది రైతులకు గాయాలు

చేవెళ్ల, ఏప్రిల్ 5: రైతు సమ్మేళనానికి వెళ్తుండగా క్వాలిస్ బోల్తా పడి 8 మంది రైతులకు గాయాలయ్యాయి. తాండూ రు ప్రాంతానికి చెందిన 8 మంది రైతులు శనివారం శంకర్ పల్లి  మున్సిపల్ పరిధిలోని బద్దం సురేందర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో  ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న ప్రకృతి, సేంద్రి య రైతు సమ్మేళనానికి కారు (టవేరా)లో బయల్దేదారు.

శంక ర్‌పల్లి మండలం ఎల్వెర్తి గ్రామ సమీపంని టర్నింగ్ వద్ద డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి ఫల్టీ కొట్టిం ది. స్థానికులు వీరి ని వెంటనే శంకర్‌పల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.