న్యూఢిల్లీ, జూలై 10: టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలు వాటి ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్) మోడల్స్ ధరల్ని తగ్గించాయి. టాటా మోటా ర్స్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలైన హరియర్ (రూ.14.99 లక్షలు), సఫారి (రూ.15.49 లక్షలు) ప్రారంభధరల్ని సవరించడంతో పాటు ఇతర ఎస్‌యూవీ వేరియంట్లపై రూ.1.4 లక్షల వరకూ విలువైన ప్రయోజనాల్ని ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి నెక్సాన్ ఈవీపై రూ.1.3 లక్షల వరకూ, ప్రయోజనాల్ని అందిస్తున్నామని టాటా పాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స తెలిపారు. పంచ్ ఈవీపై కూడా రూ.30,000 వరకూ ప్రయోజనాల్ని ఆఫర్ చేస్తున్నట్టు వెల్లడించారు. మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎక్స్‌యూవీ 700 ఫుల్లీ లోడెడ్ ఏఎక్స్7 రేంజ్ ప్రారంభధర ఇకనుంచి రూ.19.49 లక్షల నుంచి ఉంటుంది.