మాయ టాటా.. ఇప్పుడు లక్షల కోట్ల వ్యాపారానికి వారసురాలు కాబోతున్నది. ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా వాపార సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకుబోతున్నది. రతన్ టాటా ఆధ్వర్యంలో వ్యాపార చిన్నతనం నుంచి పాఠాలు నేర్చుకున్నది. టాటా వారసుల్లో ఒకరిగా తన ప్రత్యేకతను చాటుకున్నది 34 ఏళ్ల మాయ టాటా. ఆమెకు సంబంధించిన మరిన్ని విశేషాల గురించి తెలుసుకుందాం..
రతన్ టాటా ప్రతి భారతీయుడికి పరిచయం అక్కర్లేని పేరు. అయితే అందరికీ జేఆర్‌డీ టాటా, రతన్ టాటానే తెలుసు. కానీ టాటా గ్రూప్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న మాయా టాటా గురించి మీకు తెలుసా.. 34 ఏళ్ల మాయా తల్లిదండ్రులు అలూ మిస్త్రీ, నోయెల్ టాటా. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బేయర్స్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ వార్విక్‌లో మాయ ఉన్నత విద్య అభ్యసించారు. ఇక ఆమె తల్లి అలూ మిస్త్రీ టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరన్ మిస్త్రీతో బుట్టువు. నోయెల్ టాటానేమో రతన్ టాటాకు సవతి సోదరుడు.
మాయా టాటాకి న్యూ ఏజ్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల చిన్న వయసులోనే వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. 2011లో రతన్ టాటా ప్రారంభించిన కోల్‌కతా క్యాన్సర్ ఆసుపత్రిని నిర్వహిస్తున్న టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులోని ఆరుగురు సభ్యులతో ఆమె ఒకరుగా ఉన్నారు. టాటా క్యాపిటల్ సబ్సిడరీ టాటా ఆపర్చునిటీస్ ఫండ్‌లో ఆమె మొదట పనిచేశారు. అప్పుడే ఆమె పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్, ఇన్వెస్టర్ రిలేషన్స్, కార్పొరేట్ ప్రపంచంలోని డైనమిక్స్‌ను అర్థం చేసుకున్నారు. తర్వాత గ్రూప్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టాటా డిజిటల్‌కు వెళ్లారు. టాటా న్యూ యాప్ తయారలోనూ ఈమె కీలకంగా వ్యవహరించారు.
మాయ గురించి..
రూ. 20చ71,462 కోట్ల విలువైన టాటా గ్రూప్ సంస్థల బాధ్యతలను త్వరలో మాయా టాటా స్వీకరించనున్నట్లు సమాచారం. ఇటీవలే టాటా మెడికల్ సెంట్రల్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు. మాయతో పాటు ఆమె సోదరి లేహ్, సోదరుడు నెవిల్లే కూడా టాటా గ్రూప్‌లోని కీలక స్థానాల్లో పని చేస్తున్నారు. వారిలో అందరి కంటే చిన్నది మాయ మిస్త్రీ. వీరందరూ వాస్తవానికి రతన్ టాటా ఆధ్వర్యంలోనే వ్యాపార పాఠాలు నేర్చుకున్నారు.
లక్షల కోట్ల విలువైన కంపెనీ!
మాయా టాటా యూకేలోని బేయర్స్ బిజినెస్ స్కూల్, ది యూనివర్సిటీ ఆఫ్ వార్విక్‌లో విద్యాభ్యాసం చేశారు. తర్వాత టాటా గ్రూప్‌లో వివిధ హోదాల్లో పని చేశారు. టాటా గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ రూ.20,71,467 కోట్లు. 2023 మార్చి 31న వెలువరించిన వార్షిక నివేదిక ప్రకారం, వీటిలో టాటా సన్స్ కంపెనీ మాత్రమే రూ.11,20,575,24 కోట్ల విలువైన పెట్టుబడులను కలిగి ఉంది.