calender_icon.png 25 December, 2024 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడారంగంతో టాటా బంధం

11-10-2024 01:31:32 AM

ముంబై: దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటాకు క్రీడారంగంతోనూ విడదీయరాని అనుబంధముంది. స్వాతంత్య్రా నికి మునుపే 1920 ఆంట్వర్ప్ ఒలింపిక్స్‌లో అప్పటి టాటా గ్రూప్ చైర్మన్ సర్  దొరాబ్జి టాటా భారత అథ్లెట్లకు స్పాన్సర్‌గా వ్యవహరించడంతోనే క్రీడలతో అ నుబంధం మొదలైంది. రతన్ టాటా బా ధ్యతలు తీసుకున్నాకా ఆ బంధం మరింత బలపడింది.

క్రికెట్‌లో ఐపీఎల్‌కు టైటిల్ స్పాన్సర్‌గా వ్యహరిస్తోంది టాటానే. వివోతో విభేదాల కారణంగా స్పాన్సర్‌షిప్‌కు ఎవరు ముందుకు రాని సమయం లో టాటా గ్రూప్ రూ. 2500 కోట్లతో నాలుగేళ్ల కాలానికి బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకోవడంలో రతన్ టాటాది కీలకపాత్ర. టాటా స్పోర్ట్స్ పేరుతో క్రికెట్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, చెస్ సహా పలు క్రీడలకు సంబంధించిన అకాడమీలను నెలకొల్పి శిక్షణ అందించారు. 

*రతన్ టాటా సార్‌తో నేను గడిపిన క్షణాలను అదృష్టంగా భావిస్తున్నా. కోట్లాది మంది ప్రజలు అతన్ని కలుసుకోలేకపోయామన్న బాధ ఈరోజు కచ్చితంగా ఉంటుంది.  

 సచిన్ టెండూల్కర్, దిగ్గజ క్రికెటర్

* ‘రతన్ జీ.. మీ మనసు బంగారం. దేశాభివృద్ధి కోసం మీ జీవితాన్ని త్యాగం చేశారు. మీ సేవలు చిరస్మరణీయం’

రోహిత్ శర్మ, 

టీమిండియా కెప్టెన్

* ‘దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణం కలచివేసింది.ఆయనతో కలిసి పద్మ విభూషన్ తీసుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. చెస్ ఇండియాకు మీ సేవలు వెలకట్టలేనివి’

 విశ్వనాథన్ ఆనంద్, చెస్ దిగ్గజం

* ‘రతన్ టాటా జీ మరణించిన వార్త నన్ను కలచివేసింది. కొన్ని తరాలకు మీరు ఆదర్శం. టాటాజీతో నా అనుబంధం ప్రత్యేకమైనది. ఆయనతో మాట్లాడిన క్షణాలు మరిచిపోలేను. ఓం శాంతి’

నీరజ్ చోప్రా, జావెలిన్ స్టార్