ధర రూ.17.49 లక్షలు
న్యూఢిల్లీ, ఆగస్టు 7: టాటా మోటార్స్ మరో కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసిం ది. కర్వ్.ఈవీ పేరుతో మార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ మిడ్‌సైజ్డ్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.17.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). 55 కేడబ్ల్యూహెచ్ (585 కిలోమీటర్ల రేంజ్), 45 కేడబ్ల్యూహెచ్ (502 కిలోమీటర్ల రేంజ్).. రెండు బ్యాటరీ ఆప్షన్లతో ఈ కారు లభిస్తుం ది. 8.6 సెకన్లలో 100 కిలోమీటర్ల పికప్‌ను అందుకుంటుందని టాటా మోటార్స్ తెలిపింది. గరిష్ఠంగా గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ, ఆల్‌వీల్ డిస్క్ బ్రేక్స్, ఆటో హోల్డ్ తదితర భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 15 నిముషాల ఛార్జింగ్‌తో 150 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. మొత్తం ఏడు వేరియంట్లలో కర్వ్‌ను విడుదల చేశారు. రూ.17.49 లక్షల నుంచి రూ.21.88 లక్షల రేంజ్‌లో ధరను నిర్ణయించారు.