సెన్సెక్స్ ప్యాక్‌లో. అన్నింటికం టే అధికంగా టాటా మోటార్స్ 3 శాతం క్షీణించి రూ.755 వద్ద ముగిసింది. పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, సీఐసీఐ బ్యాంక్, లార్సన్ అండ్ టుబ్రో, బజాజ్ ఫైనాన్స్‌లు 1 శాతం మధ్య నష్టపోయాయి. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్‌లు స్వల్ప లాభంతో ముగిసాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా యుటిలిటీస్ ఇండెక్స్ 2.06 శాతం తగ్గింది. పవర్ ఇండెక్స్ 1.78 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.56 శాతం, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 1.30 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 1.20 శాతం చొప్పున క్షీణించాయి. ఐటీ, హెల్త్‌కేర్ సూచీలు పెరిగాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.76 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.61 శాతం చొప్పున తగ్గాయి.