calender_icon.png 22 December, 2024 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదరగొట్టిన టాటా మోటార్స్

02-08-2024 01:03:18 AM

74 శాతం పెరిగిన నికర లాభాలు

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ త్రైమాసి ఫలితాల్లో దూసుకెళ్లింది. జూన్‌తో ముగిసిన త్రొలి త్రైమాసికంలో రూ.5,566 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో నమోదయిన రూ.3,203 కోట్లతో పోలిస్తే 74 శాతం వృద్ధి చెందింది. కంపెనీ ఆదాయం కూడా వృద్ధి చెందిందని టాటా మోటార్స్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. గత ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.1,03,597 కోట్లుగా ఉన్న ఆదాయం ఈఏడాదితో రూ.1.09,623 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది.స్టాండలోన్ పద్ధతిలో రూ.2,190 కోట్ల నికర లాభం ఆర్జించింది.

గత ఏడాది ఇదే సమయంలో రూ.64 కోట్ల నికర నష్ట నమోదు కావడం గమనార్హం. కంపెనీ మొత్తం ఆదాయం రూ.16,132 కోట్లనుంచి రూ.18851 కోట్లకు చేరినట్లు తెలిపింది. కాగా ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం 71,996 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో విక్రయించిన 80,633 వాహనాలతో పోలిస్తే కాస్త తగ్గాయి. ఈ ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు విలువ బీఎస్‌ఈలో .02 శాతం పెరిగింది.