రూ.3 లక్షల వరకూ తగ్గనున్న నెక్సాన్ ఈవీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: టాటా మోటా ర్స్ తన ఎలక్ట్రికల్ వాహనాల (ఈవీలు) ధరల్ని తగ్గించింది. నెక్సాన్ ఈవీ ధర రూ.3 లక్షల వరకూ తగ్గుతుందని, పంచ్ ఈవీ రూ.1.2 లక్షలు, టియాగో ఈవీ రూ.40,000 మేర ధర దిగుతుందని టాటా మోటార్స్ తెలిపింది. ఈ తగ్గింపు ధరలు పరిమిత కాలమే అమలులో ఉంటాయని, పెట్రోల్, డీజిల్ కార్ల ధరలకు దగ్గరగా ఈవీల ధరల్ని తీసుకొచ్చామని టాటా పాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స చెప్పారు. టాటా మోటార్స్ ఇప్పటికే ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్‌తో నడిచే టియాగో, నెక్సాన్, హారియర్, సఫారి తదితర కొన్ని మోడల్స్ ధరల్ని తగ్గించింది.