calender_icon.png 3 February, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ బోల్తా

02-02-2025 01:44:33 AM

* ఆరుగురికి తీవ్రగాయాలు

ఖమ్మం, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా వైరా మండల స్టేజీ పినపాక వద్ద ఉన్న వంతెన సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరుగురు వ్యవసాయ కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. కొణిజర్ల మండలం పొద్దుటూరుకు చెందిన 15 మంది కూలీలు టాటా ఏస్‌లో పినపాక సమీపంలో కూలీ పనులకు వెళ్తుండగా పినపాక బ్రిడ్జి వద్దకు రాగానే టైర్ ఫంక్చరైంది. దీంతో వాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగింది.