calender_icon.png 19 January, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చుర్మా రుచి చూపిస్తా

06-07-2024 12:05:00 AM

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికైన అథ్లెట్లతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒత్తిడిని దూరం పెట్టి ప్రశాంతంగా ఆడితే విశ్వక్రీడల్లో మంచి ఫలితాలు వస్తాయని అథ్లెట్లకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. విదేశాల్లో ట్రైనింగ్‌తో బిజీగా ఉన్న స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, తెలుగు తేజం పీవీ సింధు, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ సహా పలువురుఅథ్లెట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ముచ్చటించారు. ట్రైనింగ్, ప్రాక్టీస్ ఎలా సాగుతుందంటూ ఆరా తీశారు.

ఈ సందర్భంగా ‘మీకు చుర్మా రుచి చూపిస్తా’ అని నీరజ్ ప్రధాని మోదీకి హామీ ఇవ్వడం విశేషం. ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శనతో ఎక్కువ సంఖ్యలో పతకాలు కొల్లగొడతామని నీరజ్ తెలిపాడు. ఇక భారత్ వేదికగా 2036 ఒలింపిక్ క్రీడలు నిర్వహించేందుకు భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) వేయనున్న బిడ్ విజయవంతమవుతుందని ఆశిస్తున్నట్లు  మోదీ పేర్కొన్నారు. భారత్ వేదికగా ప్రపంచ ప్రఖ్యాత పండుగను నిర్వహించేందుకు సూచనలు ఇవ్వాలని అథ్లెట్లను కోరారు. ఆటల్లో బిజీగా లేనప్పుడు ఒలింపిక్స్ కనీస మౌళిక సదుపాయాలకు సంబంధించి మీ అభిప్రాయాలను పంచుకోవాలన్నారు. మీరిచ్చే విలువైన సలహాలు, సూచనలు ఒలింపిక్ బిడ్డింగ్‌కు ఉపయోగపడతాయని మోదీ పేర్కొన్నారు.