జిల్లా కలెక్టర్ విజయేoదిర బోయి
మహబూబ్ నగర్, జనవరి 24 (విజయ క్రాంతి) : జిల్లాలోని యువతకు ఉద్యోగానికి కావలసిన నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టాస్క్ రీజినల్ సెంటర్‌ను అతి త్వరలో మహ బూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రారంభిoచ నున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేoదిర బోయి తెలిపారు.
టాస్క్ రీజినల్ సెంటర్ ద్వారా టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సులలో శిక్షణ కొరకు డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, పి.జి. విద్యార్థులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ సమీపంలోని టాస్క్ రీజినల్ సెంటర్ కార్యాలయంలో జనవరి 27వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.
శిక్షణ తరగతులు కోర్సులకు సంబంధించి పూర్తి వివరాలకు 9908092738 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. టెక్నికల్ శిక్షణలో భాగంగా జావా ప్రోగ్రామింగ్, వెబ్ డెవలప్మెంట్, పైథాన్ ప్రోగ్రామింగ్, డేటాబేస్ అప్లికేషన్స్, సి ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్, సూడో కోడ్, ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ మొదలగు కోర్స్ లలో ఉద్యోగ మెళకువలు నేర్పించడం జరుగు తుందని తెలిపారు.
బ్యాంకింగ్ పోటీ పరీక్షలకు (PO, క్లర్క్, స్పెషల్ లిస్ట్ ఆఫీసర్స్) అనగా ఐ.బి.పి.ఎస్. నోటిఫికెషన్స్, SBI, రూరల్ బ్యాంక్స్, కో-కోపెరేటివ్ బ్యాంక్స్ నోటిఫికెషన్స్ కి సంబంధించిన శిక్షణ నిర్వహించనునట్లు తెలిపారు.