హనుమకొండ, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటి పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడు లు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. హనుమకొండ లోని శివసాయి కాలనీలో ఓ మహిళ ఇతర ప్రాంతాల నుంచి యు వతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఏసీ పీ మధుసూదన్ ఆధ్వర్యంలో మం గళవారం దాడులు నిర్వహించా రు. వ్యభిచారం చేస్తున్న మహిళతో పాటు విటుడిని, నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు.
మంచిర్యాల జిల్లాలో
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలో వ్యభిచారం నిర్వహిస్తున్న వెంకటేశ్వర లాడ్జీపై పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడి లో ఆరుగురు విటలు, నలుగురు మహిళలు పట్టుబడినట్లు తెలిసింది.