19-02-2025 02:47:32 PM
టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్
కుమ్రంభీం అసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వాలు పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్(Task Force CI Rana Pratap) హెచ్చరించారు. కెరమెరి మండలం అనార్ పల్లి గ్రామంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పక్క సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా బొలెరో వాహనంలో 8 క్వింటళ్ల వీడిఎస్ బియ్యం తరలిస్తుండగా పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా రాణా ప్రతాప్ మాట్లాడుతూ... జిల్లాలో ఎస్పీ డీవీ శ్రీనివాస రావు(SP DV Srinivasa Rao) ఆదేశాల మేరకు అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘ పెట్టడం జరిగిందని తెలిపారు. అక్రమ వ్యాపారాలు చేపడుతున్న వారి వివరాలను ప్రజలు 100 కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ తనిఖీలలో టాస్క్ ఫోర్స్ ఎస్సై వెంకటేష్ సిబ్బంది రమేష్, దేవేందర్ ,సంజీవ్ తదితరులు ఉన్నారు.