calender_icon.png 19 October, 2024 | 3:59 PM

పబ్బులో గలీజ్ డ్యాన్సులు.. 142 మంది అరెస్ట్

19-10-2024 01:29:15 PM

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌పై హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో  42 మంది మహిళలతో సహా 140 మందిని అరెస్టు చేశారుఅధికారులు పబ్ నిర్వాహకులు, క్యాషియర్, డీజే ఆపరేటర్‌లను అదుపులోకి తీసుకున్నారు, తదుపరి విచారణ కోసం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. "టేల్స్ ఓవర్ స్పిరిట్స్ (TOS)" పబ్‌లో అక్రమ కార్యకలాపాలకు సంబంధించి పక్కా సమాచారం అందడంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కస్టమర్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో పబ్ నిర్వాహకులు వివిధ రాష్ట్రాల నుంచి అద్దెకు తీసుకున్న మహిళలతో అశ్లీల నృత్య ప్రదర్శనలకు అనుమతిస్తున్నారని ఆరోపించారు.