calender_icon.png 28 November, 2024 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

06-11-2024 11:41:27 AM

ముగ్గురు వ్యక్తుల పట్టివేత 

రూ.1400 నగదు, 3 సెల్ ఫోన్లు, 4 బైకులు స్వాధీనం 

6గురు వ్యక్తుల పరారీ... 

బెల్లంపల్లి (విజయక్రాంతి): తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లన్న గుట్ట అటవీ ప్రాంతంలో రహస్యంగా డబ్బులను పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు మంగళవారం రాత్రి మంచిర్యాల టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్సై లచ్చన్నలు తమ సిబ్బందితో పేకాట స్థావరంపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. పోలీసులకు పట్టుబడ్డ వారిలో తాండూరు మండలానికి చెందిన ఆదే శ్రీను (భార్య పల్లి), గోలెం తిరుపతి (కొత్తపల్లి), కుంట చంద్రమౌళి (రేచిని) లు ఉన్నారు. ఈ సంఘటనలో తాండూరు మండలానికి చెందిన బండి మహేష్, తాను శ్రీను, తాండూర్ శేఖర్, హనుమంతు, ఒడ్నాల రమేష్, కొల్లూరు తిరుపతి అనే 6 గురు వ్యక్తులు పరారయ్యారు. పట్టుబడ్డ వ్యక్తుల నుండి రూ.1400 నగదు, 3 సెల్ ఫోన్లు, 4 బైక్ లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని విచారణ నిమిత్తం తాండూర్ పోలీసులకు అప్పగించారు.