మంథని : పెద్దపల్లి జిల్లాలో ఓ పేకాట స్థావరంపై రామగుండం పోలీసులు శనివారం మెరుపు దాడి జరిపారు. రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్ఐ రవి ప్రసాద్, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ లతో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురని పట్టుకోగా, మరో ఇద్దరు పరారయ్యారని పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన వారి నుంచి రూ.17,200 నగదు, 4 మొబైల్స్, 2 బైక్‌లు, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వారిపై పేకాట కేసు నమోదు చేసి రామగుండం పోలీస్ స్టేషన్ లో అప్పగించమని ఎస్ఐ రవి ప్రసాద్ పేర్కొన్నారు.