calender_icon.png 30 December, 2024 | 1:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోడిపందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

01-12-2024 10:33:53 PM

ఏడుగురు అరెస్ట్

13 కోళ్లు, 60 కత్తులు, 5 ఫోన్లు, రూ.6530 నగదు స్వాధీనం

పెద్దపల్లి (విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాపుసుపల్లి గ్రామ శివారులో రహస్యంగా డబ్బులు పందెంగా పెట్టిలో కొంత మంది పందెం రాయుళ్లు పందెం కోళ్లతో పందెలకు పాల్పడుతున్నారని, నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రాజేష్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి నిర్వహించి, పందెం పెట్టుకొని కోడిపందాలు ఆడుతున్న ఏడుగురు నిందితులను పట్టుకోని, వారి వద్ద నుండి 13 పందెం కోళ్లు, 60 కత్తులు, 05 మొబైల్స్, రూ.6530 నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పరారీలో మరి కొంతమంది ఉన్నారని, పట్టుబడిన వారిలో తాళ్ల రాములు, యాదగిరి అనిల్, రావుల మధునయ్య, వెంకటేష్, మహేందర్, పెద్దపల్లికి చెందిన బుడగడ్డ నర్సయ్య, సుల్తానాబాద్ కు చెందిన మైదాంపల్లి రవితేజలు ఉన్నారు.