calender_icon.png 28 December, 2024 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిల్లుల్లో టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు

28-12-2024 02:25:51 AM

మంచిర్యాల, డిసెంబర్ 27 (విజయక్రాంతి): జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో టా స్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. లక్సెట్టిపేట మం డలంలోని జై యోగేశ్వర మిల్లులో 2023 24 ఖరీఫ్ బకాయి, దండేపల్లి మండలం లింగాపూర్‌లోని రామ్‌లక్ష్మణ్ రైస్ మిల్లును, హాజీపూర్ మండలం నర్సింగాపూర్‌లోని రాజరాజేశ్వరీ, సాయి మణికంట మిల్లుల్లో 2022 ఆక్షన్ ప్యాడీ పెండింగ్, జైపూర్ మండలం ముదిగుంట బీఎస్‌వై మిల్లులో 2022 రబీ ఆక్షన్ ధాన్యం, 2023 ఖరీఫ్ ధాన్యం, టేకుమట్లలోని బాలాజీ రైస్ మిల్లులో 2023 ఖరీఫ్ సీజన్‌లో 2,300 మెట్రిక్ టన్నుల ధాన్యం లేనట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ శ్రీధర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్‌రావుతో పాటు జిల్లా పౌర సరఫరాల శాఖ ఏసీఎస్‌వో వేణుగోపాల్, డీటీ స్రవంతి  పాల్గొన్నారు.