ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మా అటవీ ప్రాంతంలో నిల్వ ఉంచిన టేకు చెక్కలను అటవీ శాఖ టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు సోమవారం ఎల్లమ్మ గూడ సమీపంలోని అటవీ ప్రాంతంలో సోదాలు నిర్వహించగా 20 టేకు చెక్కలు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎఫ్.ఆర్.వో శ్రీనివాస్ రెడ్డి తెలిపినారు. వాటిని జప్తు చేసి, కేసు నమోదు చేసి నేరస్థుల గురించి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో గుండాల గ్రామానికి సంబందించిన నలుగురు ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ తనిఖీల్లో అధికారులు కవిత, సజన్ లాల్, శ్యామ్ సుందర్, సుభాష్, సచిన్, స్వాతి, బేస్ క్యాంప్ సభ్యులు పాల్గొన్నారు.