calender_icon.png 23 December, 2024 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మంలో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు

23-12-2024 12:47:12 AM

ఖమ్మం, డిసెంబర్ 22 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిం చారు. యువత మత్తు పదా ర్థాలకు బానిస కాకుండా నిరోధించేందుకు తనిఖీలు చేసినట్లు పోలీసులు చెప్పారు.

పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఏ సీపీ రవి ఆధ్వర్యంలో గంజాయి సేవిం చే అడ్డాలతో పాటు రోటరీనగర్ ట్యాం క్, ఎస్బీఐటీ, మమత వైద్య కళాశాల, శాంతినగర్ చర్చి కాంపౌండ్, జహీర్‌పుర పార్క్ పరిసరాలు, ప్రకాశ్‌నగర్, ఎన్టీఆర్ సర్కిల్, కొత్త బస్టాండ్, గట్ట య్య సెంటర్, సరిత క్లినిక్, సారధినగర్ దిగువ రైల్వే వంతెన, గొల్లగూ డెం ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాలను విక్రయించినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుం టామని పోలీసులు హెచ్చరించారు.