calender_icon.png 22 September, 2024 | 4:09 AM

టాస్క్‌ఫోర్స్ కమిటీలు అప్రమత్తంగా ఉండాలి

22-09-2024 01:22:37 AM

  1. ఆసుపత్రుల పనితీరుపై దృష్టి పెట్టాలి
  2. వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాం తి): ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను  వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామో దర రాజనర్సింహా ఆదేశించారు. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నిత్యం తనిఖీలు జరపాలని  సూచించారు. తనిఖీల వివరాలను ప్రతి నెలా తనకు నివేదిక రూపంలో అందించాలని సూచించారు. ఫుడ్ సెక్యూరి టీ అధికారులు హాస్పిటళ్లలోని డైట్ క్యాంటీన్లను తనిఖీ చేయాలన్నారు. ఆరోగ్యశాఖ హెవోడీలు నెలకు కనీసం రెండుసార్లు జిల్లాల్లోని హాస్పిటల్స్‌ను విజిట్ చేయాలని సూచించారు.

ఈ మేరకు మంత్రి శనివారం సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ దవాఖాన్లలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ట్రైబల్ ఏరియాల్లోని గర్భిణుల ఆరోగ్యంపై ఎక్కువగా ఫోకస్ చేసి వారం రోజుల ముందే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించాలని ఐటీడీఏ హాస్పిటళ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేసి తనకు అధికారులకు సూచించారు. టాస్క్‌ఫోర్స్ కమిటీలపై ప్రతి నెలా రివ్యూ చేస్తానని సూచించారు. అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాణి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.