20-02-2025 04:49:06 PM
ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
చేర్యాల: పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ తో పాటు స్థానిక పోలీసులు కలిసి రైడ్ చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్న సంఘటన కొమరవెల్లి మండల పరిధిలోని మరి ముచ్చల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మరిముచ్చాల గ్రామానికి చెందిన బుధిగాం బాల్ రెడ్డి వ్యవసాయ బావి వద్ద పేకాట ఆడుతున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో సిద్దిపేట జిల్లా టాస్క్ ఫోర్స్ తో పాటు చేర్యాల పోలీస్ స్టేషన్ కు సంబంధించిన పోలీసులు కలిసి పేకాట ఆడుతున్న ప్రదేశానికి వెళ్లి రైడ్ చేశారు.
ఈ దాడిలో పేకాట ఆడుతున్న మరిముచ్చల గ్రామానికి చెందిన జంగని రాజు, తురాయి కిషన్, సారా జనార్ధన్, జంగం రవి, చామంతుల రమేష్, కంటే శ్రీనివాస్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండిరూ. 2 వేల 107 రూపాయల నగదును, 5 సెల్ ఫోన్లను, ఆరు మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా పేకాట ఆడుతున్నట్టు తెలిస్తే 871667445 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. ఫోన్ చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.