calender_icon.png 23 April, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన ‘తరుణ్’

23-04-2025 01:04:49 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 22 (విజయ క్రాంతి): ఇష్టపడి చదివితే.. ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని.. చదువుకు పేద ధనిక భేదం లేదని ఇంటర్మీడియట్ ఫలితాల్లో నిరుపేద కుటుంబానికి చెందిన కారు పోతుల తరుణ్ నిరూపించాడు.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల ప్రభుత్వ ఆదర్శ (మోడల్) కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తరుణ్ 991/1000 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి గుర్తింపు పొందాడు. చిన్న ముప్పారం గ్రామానికి చెందిన తరుణ్  తండ్రి రాజు గీత కార్మికుడు కాగా, తల్లి రజిత కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని వెల్లదీస్తున్నారు.  తల్లిదండ్రుల రెక్కల కష్టాన్ని.. తనపై వారు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయి గుర్తింపు పొంది.. చదువుకు పేద ధనిక భేదం లేదని మరోసారి తరుణ్ నిరూపించాడు.