28-04-2025 01:01:13 AM
నూతన వంతెన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని తర్ణం వాగుపై ఉన్న పాత వంతెనను అధికారులు డిటోనేటర్లతో పేల్చివేశారు. 2023 సంవత్సరంలో భారీ వర్షాలతో బ్రిడ్జ్‌కు బీటలు వారడంతో అధికారులు రాకపోకల నిలిచివేశారు. దీంతో జైనథ్, బేల మండలాలతో పాటు మహారాష్ట్ర ప్రజలకు వంతెనపై నుండి రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో ప్రజల రాకపోకల కోసం వాగుపై తాత్కాలిక వంతెనలను నిర్మించారు. కానీ తరచూ వర్షాలతో తాత్కాలిక వంతెనలు కొట్టుకుపో యాయి. అంతలోనే ఆ అంతరాష్ట్ర రహదారి కాస్త జాతీయ రహదారిగా ఏర్పడడంతో ఇటీవల జాతీయ రహదారి పనులు ప్రారంభమయ్యాయి. కొత్త బ్రిడ్జి నిర్మాణానికై పాత బ్రిడ్జిని ఆదివారం నేషనల్ హైవే అధికారులు డిటోనేటర్ల సహాయంతో పేల్చివేశారు.
కూల్చివేత పనులు ఎమ్మెల్యే పరిశీలన
జాతీయ రహదారి నిర్మాణంలో భాగం గా జైనథ్ మండలం తర్నం వాగుపై ఉన్న పాత వంతెన కూల్చివేత పనులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వయంగా పరిశీలించారు. పాత వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం పాత వంతెను కూల్చివేశారు. ఈ ప్రక్రియను ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వయంగా పరిశీలించి, అధికారులతో మాట్లాడి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా నూతన వంతెన పనులు పూర్తిచేసి ప్రజల రాకపోకల ఇబ్బందులు దూరం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు