హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): కొటక్ ఇండియా అం డర్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో ముంబై జూనియర్ షట్లర్ తారిణి సూరి సత్తా చాటింది. నగరంలోని పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా జరిగిన టోర్నీలో తారిణి బాలికల డబుల్స్ విభాగంతో పాటు మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది.