calender_icon.png 5 April, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా దిగుమతులపై 34% సుంకాలు

05-04-2025 02:05:05 AM

ప్రతీకార సుంకాలపై దీటుగా స్పందించిన చైనా

  1. ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టీకరణ
  2. ఇప్పటికే 25 శాతం టారిఫ్‌లు ప్రకటించిన కెనడా
  3. చైనా భయపడింది.. ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్

బీజింగ్, ఏప్రిల్ 4: అమెరికా ప్రతీకార సుంకాలపై చైనా దీటుగా స్పందించింది. అమెరికా నుంచి చైనాకు దిగుమతి అయ్యే అన్ని ఉత్పత్తులపై 34 శాతం సుం కాలు విధిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ సుంకాలు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అమెరికా విధించిన టారిఫ్‌లపై అంతర్జాతీయ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)లో దావా వేసినట్టు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ప్రపంచ ఆర్థిక, వాణి జ్య స్థిరత్వాన్ని ప్రమాదంలో పడేసే బెదిరింపు చర్యగా చైనా అభివర్ణించింది. ‘లిబ రేషన్ డే’ పేరుతో చైనా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అమెరికా తాజాగా 34 శాతం సుంకాలు విధించింది. ఇప్పటికే చైనా ఉత్పత్తులపై అమెరికా 20 శాతం సుంకాలను అమలు చేస్తోంది.

కొత్త వాటితో కలిపి చైనా అమెరికా సుం కాల భారం 54 శాతానికి చేరింది. మరోవైపు ఇప్పటికే అమెరికాపై కెనడా టారిఫ్ యుద్ధం మొదలు పెట్టింది. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి అను గుణంగా లేని అమెరికా వాహనాలపై 25% సుంకాలు విధించనున్నట్టు కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రకటించారు. 

అమెరికా దిగుమతులపై 34 శాతం

 సుంకాలు విధించనున్నట్టు చేసిన చైనా ప్రకటనపై ట్రూత్ సోషల్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. చైనా భయపడి తప్పు చేసిందని అభిప్రాయపడ్డారు. ‘చైనా తప్పు చేసింది. వాళ్లు భయపడ్డారు. వారికి మరోమార్గం లేదు’ తన పోస్ట్‌లో ట్రంప్ పేర్కొన్నారు.