14-04-2025 01:50:15 AM
త్వరలో ప్రకటిస్తామన్న అమెరికా వాణిజ్య సెక్రటరీ
వాషింగ్టన్, ఏప్రిల్ 13: అగ్రరాజ్యం అమెరికా సుంకాల విషయంలో మరో యూటర్న్ తీసుకుంది. వివిధ దేశాల్లో తయారయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సుంకాలు లేవని శుక్రవా రం ప్రకటించిన యూఎస్ ఆదివారం మరో ప్ర కటన చేసింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు ప్రత్యేక సుంకాలు విధిస్తామని అమెరికా వాణిజ్య సెక్రటరీ లుత్నిక్ తెలిపారు.
త్వరలోనే వీటికి సంబం ధించిన సుంకాలను ప్రకటిస్తామన్నారు. అమెరికా టెక్ కంపెనీలు పెద్ద మొత్తంలో చైనా నుం చి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. చైనాపై అమెరికా పెద్ద ఎత్తున సుంకాలు విధించడంతో పరిస్థితి తారుమారై.. పలు ఉత్పత్తుల ధరలు పెరిగే పరిస్థితి ఏర్పడింది.