calender_icon.png 12 March, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెనడా మెటల్స్‌పై సుంకాలు డబుల్

12-03-2025 12:11:54 AM

నిర్ణయం తీసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్

వాషింగ్టన్, మార్చి 11: కెనడా నుంచి అమెరికాకు దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు విధిస్తూ నిర్ణ యం తీసుకున్నారు. అమెరికా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తులపై కెనడా 25 శాతం సుంకాలు విధించ డంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

అదనంగా విధించిన ఈ సుంకాలు నేటి ఉదయం నుంచే అమలు చేయమని కామర్స్ సెక్రటరీకి తన ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ఆదేశా లు జారీ చేశారు. ‘అమెరికా పాల ఉత్పత్తులపై కెనడా విధిస్తున్న సుంకాల్ని వెంటనే తగ్గించాలి. ఈ సుంకాలు ఎన్నో రోజులుగా దారు ణంగా ఉన్నాయి. బెదిరింపులు ఉన్న ప్రాంతా ల్లో విద్యుత్‌పై వెంటనే జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తాను’ అని ట్రంప్ పేర్కొన్నారు