calender_icon.png 19 April, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా ఉత్పత్తులపై 125% సుంకాలు

12-04-2025 12:00:00 AM

  1. ఈ నెల 12 నుంచి అమల్లోకి
  2. చైనా ప్రకటన
  3. ఇకపై ట్రంప్ టారిఫ్‌లను పట్టించుకోమని వెల్లడి
  4. ఐరోపా యూనియన్ మద్దతు కోరిన జిన్‌పింగ్

బీజింగ్, ఏప్రిల్ 11: అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 84 శాతం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్టు చైనా శుక్ర వారం ప్రకటించింది. ఈ సుంకాలు ఈ నెల 12 నుంచి అమల్లోకి వస్తాయని స్ప ష్టం చేసింది. అలాగే, ఇకనుంచి ట్రంప్ ప్రభుత్వం విధించే సుంకాలను తాము పట్టించుకోమని వెల్లడించింది. చైనాపై విధించిన సుంకాలు 145 శాతానికి చేరు కున్నాయని శ్వేతసౌధం గురువారం ప్రక టించింది.

ఈ నేపథ్యంలోనే అమెరికా ఉత్పత్తులపై విధించే సుంకాలను పెంచు తూ చైనా నిర్ణయం తీసుకుంది. తమపై అసాధారణ రీతిలో అధిక సుంకాలను విధించడం ద్వారా అంతర్జాతీయ, ఆర్థిక నియమాలతోపాటు ప్రాథమిక ఆర్థిక చ ట్టాలను అమెరికా ఉల్లంఘిస్తోందని చై నా ఆర్థిక మంత్రిత్వ శాఖ మండిపడిం ది. చైనా ప్రయోజనాలను దెబ్బతీయడా న్ని అమెరికా కొనసాగిస్తే కఠిన నిర్ణయా లు తప్పవని హెచ్చరించింది. 

ఐరోపా యూనియన్ మద్దతు కోరిన చైనా

అమెరికాను ఎదుర్కోవడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఐరోపా యూనియన్ మద్దతు కోరినట్టు తెలుస్తోంది. ‘చైనా, యూరప్ తమ అంతర్జాతీయ బా ధ్యతలను నెరవేర్చాలి. అలాగే, అమెరి కా ఏకపక్ష బెదిరింపులను సంయుక్తం గా ప్రతిఘటించాలి’ అని స్పెయిన్ ప్ర ధాని పెడ్రో సాంచెజ్‌తో భేటీ సందర్భం గా జిన్‌పింగ్ పిలుపునిచ్చినట్టు చైనా మీ డియా అనేక కథనాలు ప్రసారం చేసింది.