calender_icon.png 18 April, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుంకాల వార్

10-04-2025 01:17:00 AM

అమెరికా దిగుమతులపై 84% టారిఫ్‌లు ప్రకటించిన చైనా 

 18 యూఎస్ కంపెనీలపైనా ఆంక్షలు  

ప్రతీకారంగా చైనాపై ౧౨౫ శాతానికి సుంకాలను పెంచిన ట్రంప్

ఫార్మారంగంపైనా త్వరలో అమెరికా టారిఫ్‌లు

బీజింగ్, ఏప్రిల్ 9: అమెరికా మధ్య ప్రతీకార సుంకాల యుద్ధం తారాస్థాయికి చేరింది. తమ దేశ దిగుమతులపై అమెరికా విధించిన 104% సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో చైనా దీటుగా బదులిచ్చింది.

అమె రికా దిగుమతులపై ఇటీవల ప్రకటించిన 34% సుంకాలకు అదనంగా 50% సుం కాలను కలిపి 84% సుంకాలను ప్రకటించింది. ఈ సుంకాలు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని చైనా స్పష్టం చేసింది. అయితే చైనాపై సుంకాలను మరింత పెంచుతూ ౧౨౫% విధిస్తున్నట్లు ఆమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు.

చైనా మినహా మిగతా దేశాలపై సుంకాలను  ౯౦ రోజులపాటు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, తమపై అమె రికా సుంకాలను పెంచి తప్పు మీద తప్పు చేసిందని చైనా ఆక్షేపించింది. అమెరికా సుంకాలు తమ చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలతోపాటు నియమాల ఆధారిత బహుపాక్షిక వాణి జ్య వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుందని చైనా ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

అంతేకాకుండా సుంకాల విషయంపై డబ్ల్యూహెచ్‌వోలో అమెరికాపై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పరిస్థితి ప్రమాదకరంగా మారిందని డబ్ల్యూహెచ్‌వోకు చేసిన ఫిర్యాదులో చైనా పేర్కొంది. ‘ప్రభావిత సభ్యదేశాల్లో ఒకటిగా ఈ నిర్లక్ష్య చర్యపై తీవ్ర ఆందోళన, వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాం.” అని తన ఫిర్యాదులో అభిప్రాయపడింది. 

అమెరికా కంపెనీలపై ఆంక్షలు

అమెరికా వస్తువులపై సుంకాలను విధించడంతోపాటు 18 అమెరికా కంపెనీలపై ఆం క్షలు విధించింది. వీటిలో 12 కంపెనీలను ఎగుమతి నియంత్రణ జాబితాలో చేర్చగా.. మరో ఆరు కంపెనీలను నమ్మదగని కంపెనీల జాబితాలో చేర్చుతూ చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

కంపెనీలపై ఆంక్షలు ఈ నెల 10 నుంచే అమల్లోకి రానున్నట్టు చైనా స్పష్టం చేసింది. అమెరికా విధించిన సుంకాలకు సమానంగా చైనా కూడా అమెరికా దిగుమతులపై 34 శాతం సుంకాలను ప్రకటించింది. దీంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చైనాకు డెడ్‌లైన్ విధించారు. చైనా వెనక్కి తగ్గలేదు. దీంతో చైనా దిగుమతులపై ట్రంప్ 104శాతం సుంకాలను ప్రకటించారు.

భారత్ కలిసి నిలబడాలి

ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాల వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి భారత్ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి అభిప్రాయ పడ్డారు. రెండు అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇబ్బందులను అధిగమిం చడానికి కలిసి నిలబడాలి’ అని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 

ఫార్మారంగంపై టారిఫ్‌లు

ఫార్మా రంగంపై త్వరలో టారిఫ్‌లు విధించినట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రిపబ్లికన్ల డిన్నర్ సందర్భంగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు.