calender_icon.png 5 March, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుంకాల వార్!

05-03-2025 12:56:31 AM

  1. డ్రాగన్‌పై సుంకాలు డబుల్ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 
  2. కెనడా, మెక్సికోపై కూడా మోత
  3. ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డ చైనా, కెనడా 
  4. ప్రపంచ మార్కెట్లు డమాల్

వాషింగ్టన్, మార్చి 4: సుంకాలు.. ప్రతీకార సుంకాలతో వాణిజ్య యుద్ధం మొదలై నట్లే కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్ సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. తాము ఏమీ తక్కువ తినలేదని చైనా, కెనడా గట్టి బదులిచ్చాయి. ఫలితంగా సుంకాలు.. ప్రతీకార సుంకాల భయాలతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి.

చైనా మీద ఉన్న సుంకాలను 10 శాతం నుంచి 20 శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షు డు ట్రంప్ నిర్ణయం ప్రకటించడం మాత్రమే కాకుండా.. ఇందుకు సంబంధించి కార్యనిర్వాహక ఉత్తర్వులను కూడా జారీచేశారు. అంతేకాకుండా కెనడా, మెక్సికోలపై అంతకు ముందు విధించిన సుంకాల విషయంలో తన వైఖరి తటస్థంగా ఉందని తెలిపారు.

గతంలో కెనడా, మెక్సికో దేశాలపై అధ్యక్షుడు ట్రంప్ 25 శాతం సుంకాలు విధించ గా.. కెనడా, మెక్సికో అధ్యక్షులు ట్రంప్‌తో చర్చించి.. ట్రంప్ చెప్పిన విధంగా చేస్తామని చెప్పడంతో సుంకాల అమలును నెలరోజుల పాటు నిలిపివేశారు.ఆ సమయం పూర్తుందని మార్చి 4 నుంచి సుంకాలు యథావిధి గా అమలవుతాయని ఆయన ప్రకటించారు. 

ప్రతీకార సుంకాలు.. 

చైనా మీద ట్రంప్ 20 శాతం సుంకాలు ప్రకటించడంతో చైనా కూడా ప్రతీకార సుం కాలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అమెరి కా నుంచి దిగుమతి అవుతున్న  వస్తువులపై 10 నుంచి 15 శాతం సుంకాలు విధించనున్నట్లు చైనా ప్రకటించింది. ఈ సుంకాలు మార్చి 10 నుం చి అమల్లోకి వస్తాయని పేర్కొంది.

ఇక అమెరికా సుంకాలపై కెనడా కూడా గట్టి బదులిచ్చింది. అమెరికా నుంచి తమ దేశానికి వచ్చే వస్తువులపై 25 శాతం సుంకాలు విధించనున్నట్లు అధ్యక్షుడు ట్రూడో ప్రకటించారు. ఇవి మార్చి 4 నుంచే అమ లు చేయనున్నట్లు ప్రకటించారు. 

వాణిజ్య యుద్ధానికి తెరలేపారు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపారని వారెన్ బఫెట్ అభిప్రాయపడ్డారు. ఓ  ఇంట ర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘సుంకాల విషయంలో మా కు చాలా అనుభవం ఉంది. అవి యుద్ధ చ ర్య. అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తుతం నేను మాట్లాడను’. అని బఫెట్ అన్నారు. 

మాకు ప్లాన్ బీ, సీ, డీ ఉన్నాయి

మా వద్ద ప్లాన్ బీ, సీ, డీ ఉన్నాయి. వాషింగ్టన్ నుంచి వచ్చే ఎటువంటి సుంకాల చర్యనైనా ఎదుర్కొనేందుకు మెక్సికో సిద్ధంగా ఉంది. 

 క్లాడియా షీన్‌బామ్, 

మెక్సికో అధ్యక్షురాలు

చైనాపై ఎందుకంటే..? 

చైనా ఫెంటానిల్ డ్రగ్ అక్రమ రవాణా ను అడ్డుకోవడంలో విఫలమైందని, అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరి కా అధ్యక్షుడు ప్రకటించారు. ట్రంప్ అధికారంలోకి రాకముందు నుంచే ఫెంటానిల్ డ్రగ్ చైనా వల్లే అమెరికాలోకి వస్తుందని ఆరోపి స్తూ వస్తున్నారు.

ఇక అప్పట్లో కెనడా, మెక్సికోల మీద ప్రకటించిన సుంకాలను నెలరో జుల పాటు వాయిదా వేస్తూ ట్రంప్ నిర్ణ యం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ నెల పూర్తి కావడంతో కెనడా, మెక్సికోల మీద సుంకాలు అమలుచేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ నిర్ణయంతో వాణిజ్య భయాలు మొదలై ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లు డమాల్ అని కుప్పకూలాయి.