calender_icon.png 5 November, 2024 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తే సహించం

05-11-2024 03:33:37 AM

పదేళ్లలో కేటీఆర్ ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేదు?

ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర సాయం తీసుకుంటాం 

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

ఖమ్మం, నవంబర్ 4 (విజయక్రాంతి): కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు, ఆరోపణలు చేస్తే ప్రజలు సహించరని రెవె న్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేటీఆర్ ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని అనుకోవడాన్ని స్వాగతిస్తామని చెప్పారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలపై దుమ్మెత్తిపో యాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఖమ్మంలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ పాదయాత్రపై ఈ వ్యాఖ్యలు చేశారు.

పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌కు ప్రజల కష్టాలు తెలుసుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేకపోయింద న్నారు. కాగా తనపై ఈడీ, ఐటీ దాడులు గురించి అధికారులే సమాధానం చెబుతార ని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కేంద్రం సాయం తీసుకుంటామని, కేంద్రం సాయం చేయకపోయినా తామే సొంతంగా ఇళ్లను నిర్మించి పేదలకు ఇస్తామన్నారు. 

అధికారులతో సమీక్షా సమావేశం 

కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో తిరుమలాయపాలెం మండల అభి వృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్షించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. వరదల వల్ల దెబ్బతిన్న కాల్వల మరమ్మతు పనులు వెంట నే చేపట్టాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్ శాఖల కింద పాలేరు నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. డబుల్ రోడ్డు నిర్మాణంలో ఎక్కడైనా ఇళ్లు పోతే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు.

అవసరమైతే ఇంటి పట్టాలు కూడా మరోచోట అందిస్తామన్నారు. నియోజవకర్గంలో పూర్తి స్థాయిలో చేప పిల్ల ల పంపిణీ వారంతం  నాటికి పూర్తి కావాలన్నారు. వెటర్నరీ డాక్టర్లు తమ పరిధిలోని గ్రామాల్లో వారంలో మూడుసార్లు  పర్యటించాలని అన్నారు. రైతులకు వరద సహాయం  అందించేందుకు ఎకరానికి రూ.60 లంచం ఇవ్వాలని కొంత మంది అధికారులు అడిగినట్లు సమాచారం అందిందని, దీనిపై విచా రించి నివేదిక సమర్పించాలని  ఆర్డీవోను ఆదేశించారు.

కాగా డిసెంబర్ నాటికి రైతురుణమాఫీ పెండింగ్ నిధులను విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. ప్రభుత్వ స్థలా ల్లో కబ్జాలో పేదలు   ఉంటే పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సంపన్నులు, రాజకీయంగా ప్రభావితం చేసే వారు ఉంటే స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించారు.