పాక్‌తో సౌతాఫ్రికా తొలి టెస్టు
సెంచూరియన్: ప్రతిష్ఠాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ తొలిసారి ఆడాలని ఉవ్విళ్లూరుతోన్న సౌతాఫ్రికా నేటి నుంచి పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. డబ్ల్యూటీసీ పట్టికలో టాప్ స్థానంలో కొనసాగుతున్న సఫారీలు పాక్‌పై విజయంతో ఆ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకొని డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. రెండు టెస్టుల్లో ఒక్కటి నెగ్గినా సఫారీలు వచ్చే ఏడాది లార్డ్స్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడనున్నారు. దక్షిణాఫ్రికా గడ్డపై పాకిస్థాన్‌కు అంత గొప్ప రికార్డేమి లేదు. ఇప్పటివరకు 15 టెస్టులు ఆడిన పాక్ కేవలం రెండు మాత్రమే గెలిచి 12 మ్యాచ్‌లు ఓడింది. టీ20 సిరీస్‌ను నెగ్గిన సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ను మాత్రం పాక్‌కు కోల్పోయింది.