calender_icon.png 16 November, 2024 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రూనైలో మోదీకి ఘన స్వాగతం

04-09-2024 02:11:39 AM

రెండు రోజుల పాటు కొనసాగనున్న పర్యటన

బందర్‌సెరిభగవాన్ (బ్రూనై), సెస్టెంబర్ 3: భారత ప్రధాని నరేంద్ర మోదీకి బ్రూనై దేశంలో ఘన స్వాగతం లభించింది. ఆ దేశ సుల్తాన్ హాజీ హసనల్ బల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ మంగళవారం బ్రూనైలో పర్యటించారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. బ్రూనై విజిట్ చేసిన మొదటి భారత ప్రధానిగా మోదీ రికార్డులకెక్కారు. ఈ సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ అల్ ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన కొనసాగుతోంది.

రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, అంతరిక్ష సాంకేతికత, ఆరోగ్యం, సామర్థ్యం పెంపుదల, సంస్కృతి, శక్తిమంతమైన వ్యక్తులేొప్రజల మార్పిడి వంటి బహుళ రంగాల్లో సహకారం వంటి ద్వైపాక్షిక అంశాలపై ఇరుదేశాల అధినేతలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని సమాచారం. కాగా గత నెలలో వియంటియన్‌లో ఆసియన్ సమావేశాల్లో పాల్గొన్న భారత, బ్రూనై విదేశాంగ మంత్రులు జైశంకర్, ఎరివాన్ పెహిన్ యూసుఫ్‌ను కలిసి ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై ఓ స్పెషల్ లోగోను విడుదల చేశారు.