రెండో అతిపెద్ద ఏవియేషన్ షో
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: భారతదేశ అతిపెద్ద బుహుపాక్షిక వైమానిక షో రెండో దశ (తరంగ్ శక్తి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 30న ప్రారంభమైన ఈ షో ఇప్పటికే ప్రారంభం అవ్వగా సెప్టెంబర్ 13 వరకు కొనసాగనుంది. ఈ షోలో ఆస్ట్రేలియా, గ్రీస్, శ్రీలంక, యూఏఈ, జపాన్, సింగపూర్, అమెరికా వంటి దిగ్గజ దేశాలు పాల్గొంటున్నాయి. ఈ ఏవియేషన్ షోలో ఆస్ట్రేలియాకు చెందిన ‘రాయల్ ఆస్ట్రేలియన్ మెదటి యుద్ధ విమానం’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఆస్ట్రేలియాకు చెందిన 6 స్కాడ్రన్ నుంచి మూడు ఈఏ గ్రోవర్ విమానాలు, 120 మంది సిబ్బంది ఈ షోలో తమ ప్రదర్శన ఇవ్వనున్నారు. దాదాపు 11 దేశాలు, 18 మంది పరిశీలనకు తరంగ్ శక్తి పాల్గొననున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియర్ ఎయిర్ స్టాఫ్ చీఫ్, ఎయిర్ మార్షల్ స్టీఫెన్ చాపెల్ మాట్లాడుతూ... భారతదేశం ఆస్టేలియాకు అత్యున్నత స్థాయి భద్రతా భాగస్వామి అని తెలిపారు. ఆస్ట్రేలియా, భారత్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఇండో పసిఫిక్ స్థిరత్వానికి దోహదపడే ప్రత్యక్ష సహకారానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు.