calender_icon.png 6 January, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తారక్క లొంగుబాటు

02-01-2025 02:07:04 AM

  1. గడ్చిరోలిలో సీఎం ఫడ్నవీస్ ఎదుట..
  2. మరో పదిమంది మావోయిస్టులు కూడా..
  3. మల్లోజుల వేణుగోపాల్ భార్య తారక్క

పెద్దపల్లి/కరీంనగర్, జనవరి 1 (విజయక్రాంతి): మహారాష్ట్రల్లో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు నాయకురాలు తారక్కతో పాటు 11 మంది కీలక నక్సలైట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట బుధవారం లొంగిపోయారు.

మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి భార్య తారక్క. పశ్చిమ బెంగాల్‌లో గతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు నాయకుడు కిషన్‌జీ కోడలు. తారక్క 1983లో మావోయిస్టు పార్టీలో చేరారు. గడ్చిరోలి నుంచి మొదటి మహిళా మావోయిస్టు ఆమె.

తారక్క ప్రస్తుతం మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యురాలుగా కొనసాగుతున్నా రు. ఆమె అసలు పేరు విమలా సీదం. ఆమె పై 170కి పైగా తీవ్రమైన నేరాలు నమోదయ్యాయి. నాలుగు రాష్ట్రాల్లో ఆమెపై రూ.2 కోట్లకుపైగా రివార్డు ఉంది. గడ్చిరోలి జిల్లా లో మావోయిస్టు ఉద్యమంలోకి ఎంతోమందిని చేర్చడంలో తారక్క అత్యంత కీలక పాత్ర పోషించారు. 

అంచెలంచెలుగా ఎదిగిన తారక్క

తారక్క లొంగిపోవడం సంచలనమే. మావోయిస్టు ఉద్యమంలో తారక్క అంచెలంచెలుగా ఎదిగారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్(డీకేఎస్‌జెడ్‌సీఎం) తారక్క, డీవీసీఎం ర్యాంకులోని ముగ్గురు సీనియర్ మావోయిస్టులతోపాటు డిప్యూటీ కమాండ్, ఇద్దరు ఏసీఎం స్థాయి మావోయిస్టులు, నలుగురు ప్లాటూన్ సభ్యులు  సీఎం ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు.

సిడాం విమల చంద్ర అలియాస్ తారక్క అలియాస్ వత్సల మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఆమెను 1986 లో అహేరి ఎల్‌వోఎస్ సభ్యురాలిగా నియమించారు. 1987లో పెరిమిలికి బదిలీ చేయ గా, 1994లో పెరిమిలి ఎల్‌వోఎస్‌లో పార్టీ సభ్యురాలిగా పదోన్నతి పొందారు. 1944 లో ఏసీఎం హోదా, 1995లో పెరిమిలి ఎల్‌వోఎస్ కమాండర్‌గా వ్యవహరించారు.

ఆ తర్వాత భమ్రాగడ్ ఎల్‌వోఎస్ కమాండర్‌గా పదోన్నతి పొంది 2006 వరకు భమ్రాగడ్ ప్రాంతంలో ఏసీ సెక్రటరీగా పనిచేశారు. 2006లో దక్షిణ గడ్చిరోలి డివిజన్‌లో డీవీసీఎంగా పదోన్నతి పొంది 2010 వరకు పనిచే శారు. 2010 కంపెనీ నంబర్ 9(నిబ్ కంపెనీ)కి బదిలీ అయి సెప్టెంబర్ 2018 వరకు పనిచేశారు.

సెప్టెంబర్ 2018లో రాహికి బదిలీ కాగా, సెప్టెంబర్ 2024 వరకు పనిచేశారు. సెప్టెంబర్ 2024లో డీకేఎస్‌జెడ్‌సీఎం(దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలి)గా పదోన్నతి పొందిన తారక్క ఇప్పటివరకు డీకే వైద్య బృందానికి ఇంచార్జిగా పనిచేశారు.