నిజామాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కో మార్కెటింగ్ సొసైటీ(ఐసీడీఎంఎస్) చైర్మన్‌గా రాంపూర్ సొసైటీ చైర్మన్ తారాచంద్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కోవాఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ ఆదేశాల మేరకు సోమవారం ఎన్నిక నిర్వహిం చారు. కామారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ రామ్మోహ న్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. డిచ్‌పల్లి రాంపూర్ సొసైటీ చైర్మన్ తారాచంద్ నాయక్, గాంధారీ సొసైటీ చైర్మన్ సాయిలు నామినేషన్లు దాఖాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు సాయిలు తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకోవడంతో తారాచంద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అప్పటి వరకు బీఆర్‌ఎస్ నుంచి ఉన్న ఐసీడీఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహ న్ రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమయింది.