calender_icon.png 12 February, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తపస్‌పల్లి నీటిని విడుదల చేయాలి

12-02-2025 01:12:32 AM

 కొండపాక, ఫిబ్రవరి 11: కొండపాక మండలంలోని 11 గ్రామాల చెరువులకు తపాస్ పల్లి నుండి డి 4 కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసి, చెరువులను నింపాలని వివిధ గ్రామాల రైతులు మంగళవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో  వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మర్పడగా, రాంపల్లి, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, సురేందర్ రెడ్డి, బిఆర్‌ఎస్ అధ్యక్షులు కనకయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ బాల్ నర్సయ్య, కొండపాక మండల బిఆర్‌ఎస్ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ లు మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, కె చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు లు రైతులకు ఉపయోగపడే విధంగా 11 గ్రామాల చెరువులను ప్రతి సంవత్సరం నింపి పంటలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆర్థికంగా రైతులు నిలదొక్కుకున్నారని అన్నారు.

కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులను పట్టించుకున్న పాపాన లేదన్నారు. రైతులు వేసిన పంటలు చేతికి అందే ముందు ఎండిపోయి నష్టపోయే అవకాశం ఉందన్నారు.

రైతుల బాధను అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు తపస్ పల్లి నుండి డి 4 కెనాల్ ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఎద్దు ఏడ్చిన యవసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డ దాఖలాలు లేవని, దేశానికి అన్నం పెట్టే రైతన్న ను సంతోషంగా ఉంచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. సాయిలు, యాదగిరి, నరసింహారెడ్డి, కిష్టయ్య, శ్రీనివాస్ రెడ్డి, కోలా ఉపేందర్, కటికే బాలాజీ, రైతులు బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.