calender_icon.png 18 January, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు తపస్ మద్దతు

18-01-2025 02:15:31 AM

హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యకు, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) సంపూర్ణ మద్దతు తెలిపింది.

శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంతరావు, నవాత్ సురేశ్ తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీ అంజిరెడ్డికి తమ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.