ప్రేక్షకాదరణ పొందిన సినిమా ‘2018’తో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందింది కథానాయకి తన్వీ రామ్. ఇప్పుడు ఏకాక్షర చిత్రం ‘క’తో మరోసారి తన అందం, అభినయంతో ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్ మూవీనే ‘క’. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నయన్ సారికతోపాటు తన్వీరామ్ కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.
చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తు న్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దు ల్కర్ సల్మాన్ రిలీజ్ చేయనున్నారు. అ యితే, ఈ సినిమాలో మంచి ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించనున్న తన్వీరామ్‌కు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు.
తన్వీని రాధగా పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ పోస్టర్‌లో ఈ అమ్మడు.. సంప్రదాయ వస్త్రధారణలో దాండియా ఆడుతూ ఆకట్టుకుంటోంది. తెరపై తనివి తీరా దాండియా ఆడటం ద్వారా తెలుగువారి అభిమానం దండిగా సంపాదించుకునేందుకు తన్వి చేస్తున్న ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం!