- ఇంకుడు గుంతలు నిర్మించుకోని ఇళ్లకు జలమండలి షాక్
- ఆయా ఇళ్లనుంచి ట్యాంకర్ బుక్ చేస్తే రెట్టింపు రేట్ వసూలు
- జనవరి 1 నుంచి అమల్లోకి నూతన చార్జీలు
- వెంటనే ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి:
- జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ ౨౭(విజయక్రాంతి): గ్రేటర్‌లో ఇంకుడు గుంతలు లేని ఇండ్లపై జలమండలి ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని పలుమార్లు నోటీసులు జారీచేసి హెచ్చరించినా నిర్లక్ష్యం చేస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
ఇందులో భాగంగా ఇంకుడు గుంతలు లేని ఇండ్ల నుంచి వాటర్ ట్యాంకర్ బుక్ చేస్తే వారి నుంచి రెట్టింపు చార్జీలను వసూలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి వెల్లడించారు.
ముందుగా వాటర్ ట్యాంకర్లను ఎక్కువగా బుక్ చేస్తున్న ఇండ్లను గుర్తించిన జలమండలి అధికారులు వారిలో ఇంకుడు గుంతలు లేనివారికి ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు. అయినప్పటికీ స్పందించకుండా వ్యవహరించే వారి పట్ల కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది.
నీటి ఎద్దడిని తగ్గించి.. భూగర్భ జలాలు పెంచేలా
వేసవి వచ్చిందంటే చాలు నగరంలో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. దీం జలమండలి సరఫరా చేసే వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోంది. సాధారణంగా ప్రతి రోజు డెలివరీ చేసే ట్యాంకర్ల కంటే రెట్టింపు ట్యాంకర్లను గత వేసవిలో జలమండలి సరఫరా చేసింది. నాలుగు నెలల్లో 7లక్షలకు పైగా వాటర్ ట్యాంకర్లను సరఫరా చేసింది.
అయితే గత వేసవిలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మణికొండ, షేక్‌పేట సహా 25 ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గడంతో ఈ సమస్య ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జలమండలి ఆధ్వర్యంలో ఈ ప్రాంతాలతో పాటు 300 గజాల కంటే ఎక్కువగా ఉండే ఇండ్లను స్పెషల్ డ్రైవ్‌లో 18 బృందాలతో సర్వే చేయించింది.
ఈ సర్వేలో ఇంకుడు గుంతలు లేని వారికి నోటీసులిచ్చారు అధికారులు. అయితే నోటీసులి చ్చిన వారిలో కేవలం కొందరు మాత్రమే ఇంకుడు గుంతలను నిర్మించుకోగా.. మెజా ర్టీ ప్రజలు ఇప్పటికీ ఇంకుడు గుంతలను నిర్మించుకోలేదు.
ఈ క్రమంలో వారికి ట్యాంకర్ చార్జీలను డబుల్ రేట్లకు సరఫరా చేయాలని జలమండలి అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. వెంటనే ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలిన జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి నగర ప్రజలకు సూచించారు.
ఆ ఇళ్లపై ఫోకస్..
ఈ ఏడాది అక్టోబర్ 2న జలమండలి చేపట్టిన 90రోజుల స్పెషల్ డ్రైవ్‌లో సీవరేజీ ఓవర్‌ఫ్లో, సీవరేజీ పైప్‌లైన్ డీసిల్టింగ్ చేయడంతో పాటు ఇంకుడు గుంతలు నిర్మించు వినియోగదారులకు అవగాహన కల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జలమండలి పరిధిలోని దాదాపు 42వేల ఇళ్లను అధికారులు సర్వే చేశారు.
వీటిలో 40వేల ఇళ్ల నుంచి వాటర్ ట్యాం కోసం నిత్యం బుకింగ్స్ వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో దాదాపు 22,500 ఇళ్లకు ఇంకుడు గుంతలు ఉన్నాయి. 17వేలకు పైగా ఇళ్లకు ఇంకుడుగుంతలు లేవు. ఈ ఇళ్ల్లపై జలమండలి ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు 10వేల మందికి పైగా ఇండ్ల యజమానులకు నోటీసులు ఇచ్చారు.
మరో 6వేలకు పైగా ఇండ్ల యజమానులకు నోటీసులు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతోంది. వాల్టా చట్టెేం ప్రకారం 200గజాలు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేవారు తప్పకుండా ఇంకుడు గుంత నిర్మించుకో నిబంధన ఉంది.