calender_icon.png 10 March, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టంకరి శివప్రసాద్ యాదవ్ కు డాక్టరేట్ ప్రధానం..

10-03-2025 06:40:53 PM

అవార్డు గ్రహీతను ప్రత్యేకంగా అభినందించిన పలువురు ప్రముఖులు..

మహబూబ్ నగర్ రూరల్: సహాయ ఫౌండేషన్" అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో దాదాపుగా 5000 మందికి పైగా రక్త దానాలు, తెల్ల రక్త కణాల దానాలు, ప్లాస్మా దానాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడటం జరిగింది. ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడానికి గుర్తించినటువంటి "గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ (Global Human Peace University)" వారు తమిళనాడు రాష్ట్రంలోని ఊటీలో గల హెచ్, ఎ, డి, పి రిసోర్సు సెంటర్ ఫర్ ట్రైబల్ కల్చర్ (HADP Resource Centre of Tribal Culture)హాల్లో రామచంద్రపుర్ గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన "సహాయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టంకరి శివప్రసాద్ యాదవ్ కు డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ చైర్మన్ డా.పి.మన్యుయల్, వైస్ ఛాన్స్లర్(Vice Chancellor) ఫార్మర్ జడ్జ్ డా.కె.వెంకటేషన్, డైరెక్టర్ డా.ఎం.రామచంద్ర, జాయింట్ డైరెక్టర్ డా.ఆరిఫుద్దీన్, తమిళనాడు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ కలెక్టర్ కె.సంపత్, ఊటీ ఎమ్మెల్యే.ఆర్.గణేష్, కౌన్సిల్ మైన్మర్ ప్రొఫెసర్.డా.జె.రంగరాజన్, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కె.మనోహర్, కోయంబత్తూర్ రిటైర్డ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రామచంద్రన్, ఇండియా ఎర్త్ క్లాసిక్ విన్నర్ డా.జయ మహేష్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రత్యేకంగా శివప్రసాద్ ను అభినందించారు.