- పీవీ సింధు ఓటమి
- ఇండోనేషియా మాస్టర్స్
జకర్తా: ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం భారత్‌కు ఏదీ కలిసిరాలేదు. సింగిల్స్‌లో లక్ష్యసేన్, మిక్స్‌డ్ డబుల్స్ మినహా మిగతా అన్నింటిలోనూ పరాజయాలే ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21-9, 21-14తో ఒబయాషి (జపాన్)పై సునాయాస విజయాన్ని అందుకున్నాడు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో తనీశా- ధ్రవ్ జోడీ 21-18, 21-14తో పాంగ్ హో- సు యిన్ (మలేషియా)పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది. మరో డబుల్స్ జోడీ రోహన్ కపూర్-రుత్విక జోడీ మాత్రం పరాజయం పాలైంది. భారత షట్లర్ పీవీ సింధు ఇండోనేషియా మాస్టర్స్‌లో మాత్రం తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టింది.
మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లో సింధూ 20-22, 12-21తో వియత్నాంకు చెందిన తుయ్ గుయెన్ చేతిలో ఓటమి చవిచూసింది. మిగిలిన మ్యాచ్‌ల్లో తాన్య హేమంత్, అనుపమ ఉపాధ్యాయ ఓటమి పాలవ్వగా.. పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు, కిరణ్ జార్జి, ఆయుశ్ శెట్టి తొలి రౌండ్‌కే పరిమితమయ్యారు.