calender_icon.png 29 December, 2024 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుమ్మురేపిన తమిళ్ తలైవాస్

07-12-2024 12:32:30 AM

పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో తమిళ్ తలైవాస్ దుమ్మురేపింది. శుక్రవారం పుణే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 40 గుజరాత్ జెయిం ట్స్‌పై ఘన విజయం సాధించిం ది. తలైవాస్ తరఫున మోయిన్ షఫాగీ (13 పాయింట్లు) సూపర్ టెన్ సాధించగా.. సౌరబ్, హిమాన్షు చెరో 7 పాయింట్లు సాధించారు. గుజరాత్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన హిమాన్షు (11 పాయింట్లు) సూప ర్ టెన్‌తో మెరిశాడు.

మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 42 తేడాతో పట్నా పైరేట్స్‌పై విజయాన్ని అందుకుంది. హర్యానా తరఫున శివమ్ పటారే (11 పాయింట్లు) సూపర్ టెన్‌తో మెరవగా.. పట్నా తరఫున రెయిడర్ దేవాంక్ (13 పాయింట్లు) సాధించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నేటి మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో పునేరి పల్టన్, తెలుగు టైటాన్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడనున్నాయి.