calender_icon.png 23 December, 2024 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమిళ పాఠశాలలను పున:ప్రారంభించాలి

23-12-2024 02:41:36 AM

తమిళ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంకే బోస్

ముషీరాబాద్, డిసెంబర్ 22 : (విజయక్రాంతి): రాష్ట్రంలో గతంలో కొనసాగిన 20 తమి ళ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం పున: ప్రారంభించాలని ప్రభుత్వానికి తెలంగాణ తమిళ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంకే బోస్ విజ్ఞప్తి చేశారు. తమిళులు మాతృబాషను నేర్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని  కోరారు.

ఈ మేరకు ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్యవిజ్ఞాన కేంద్రం మెయిన్ హాల్‌లో తెలంగాణ తమిళ సంఘం 6వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన సంవత్సర క్యాలెండర్, సంఘం సావనీర్‌ను ఆయన ఆవిష్కరించారు.

అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో 8 లక్షల మంది ఉన్న తమిళులు ఉన్నారని, తమిళుల ఆత్మగౌరవ భవనం కోసం 10 ఎకరాల స్థలంతో పాటు నిధులు కేటాయించాలని  కోరారు. తమిళులకు రెవెన్యూ ఆఫీసులలో కుల సర్టిఫికెట్ జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 

 ప్రభుత్వ ఉద్యోగాలలో 10 శాతం వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. తమిళుల అభివృద్ధి, సంక్షేమం కోసం సహకారం అందించాలని, ప్రభుత్వ పథకాలలో అవకాశం కల్పించాలని  కోరారు. 

కార్యక్రమంలో కేరళ రాష్ట్ర అసిస్టెంట్ కలెక్టర్ డాక్టర్ మోహన్ ప్రియా, సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎంకే స్టాలిన్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖా సంచాలకులు మామిడి హరికృష్ణ, డీఆర్‌డీఓ జాతీయ డైరెక్టర్ మాణిక్యవాసకం, డాక్టర్ విశ్వేశ్వర్, బ్రహ్మకుమారి రాజయోగ ప్రతినిధి శ్రీలత, తమిళ సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తమిళ మహిళలు, విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురిని ఘనంగా సత్కరించారు.