భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) తమిళనాడు డ్రాగన్స్ మూడో విజ యాన్ని అందుకుంది. ఆదివారం ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 3 తో విజయాన్ని అందుకుంది. తమిళనాడు తరఫున జిప్ జాన్సెన్ (ఆట 6వ ని.లో ), నాథన్ ఎఫార్మస్ (19వ ని.లో), బ్లే గోవర్స్ (21వ ని.లో) గోల్స్ సాధించగా..
టోమన్ డిమినే (2వ, 37 ని.లో) ఢిల్లీకి డబుల్ గోల్స్ అందించాడు. మహిళల లీగ్‌లో బెంగాల్ టైగర్స్‌పై 1 తేడాతో సూర్మా గెలుపును అందుకుంది. షానన్ (38వ ని.లో), చార్లెట్ (42వ ని.లో), సలిమా టిటే (44వ ని.లో), సోనమ్ (47వ ని.లో) సూర్మాకు గోల్స్ అందించగా.. హన్నా కాటర్ (7వ ని.లో) బెంగాల్ టైగర్స్‌కు ఏకైక గోల్ అందించాడు. నేడు టీమ్ గొనాసికాతో సూర్మా హాకీ క్లబ్ తలపడనుంది.